ఈ ముద్దుగుమ్మకు అసలు సినిమాలంటేనే ఇష్టం లేదట..

ఈ రోజుల్లో సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఎదురు చూస్తున్నారు. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగినా చిన్న ఛాన్స్ రావడం కష్టమే. మరి ఓ ముద్దుగుమ్మ మాత్రం తాను ఇందుకు విరుద్ధమంటోంది. ఓ ప్రముఖ హీరోకి చెల్లెలైన ఈమెకు సినిమాలంటే ఇష్టం లేదట. ఇక నేను సినిమాల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పేసిందని తన అన్నే స్వయంగా తెలిపారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ చెల్లెలు అన్షుల. చూడటానికి బొద్దుగా.. బంగారు బొమ్మలా ఉంటుంది.
ఇటీవల అర్జున్ ఓ ఇంటర్వ్యూలో తన గారాల చెల్లితో తనకు ఉన్న అనుబంధం సినిమాలపై అన్షులకు ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
అన్షుల సినిమాలు మాత్రం బాగా చూస్తుందని కానీ తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని పేర్కొన్నారు. అన్షుల ఓ సాధారణ అమ్మాయిలాగే నెట్‌లో టికెట్స్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సినిమా చూస్తుందని అనంతరం ఓ సాధారణ ప్రేక్షకులరాలిగా ఫీడ్ బ్యాక్ ఇస్తుందని తెలిపారు. తన సినిమా రిలీజ్ అవగానే అన్షుల ఒపీనియన్ అడుగుతానని ఆమె ఇచ్చే రిజల్ట్‌ని బట్టి ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుందని అర్జున్ తెలిపారు.