ఈసారి నమ్రత పోస్ట్ చేసిన ఫోటో పెను సంచలనం..

ప్రిన్స్ మహేశ్ బాబు భార్య నమ్రత.. తన ఫ్యామిలీ.. మహేశ్‌కి సంబంధించిన షూటింగ్ వివరాలు అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన కూతురు సితార డ్యాన్స్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాను తనవైపు తిప్పుకున్న నమ్రత ఇప్పుడు ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఫోటోకు ఒక క్యాప్షన్‌ను జత చేసింది. ఇంకేముంది సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ ఫోటో నాటి.. నేటి తరానికి కూడా బాగా నచ్చేసింది. ఆమె అబ్జర్వేషన్‌కి నెటిజన్లు వాహ్ అంటున్నారు. ఇంతకీ ఏంటా ఫోటో అంటారా?
మహేశ్ నటిస్తున్న స్పైడర్ సినిమా షూటింగ్ రొమేనియాలో జరుపుకుంటోంది. ఆ సెట్‌లో మహేశ్ ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోకి నమ్రత మరో ఫోటో యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహేశ్‌కి జత చేసిన ఫోటో ఎవర్ గ్రీన్ నటుడు.. సూపర్ స్టార్ కృష్ణది. వీరిద్దరి ఫోటోకు క్యాప్షన్ ఏంటో తెలుసా? “అప్పుడు.. ఇప్పుడు.. మా లెజెండరీ మామగారు- ఆయన అందమైన కుమారుడు” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో మహేశ్.. హీరో కృష్ణ ఫ్యాన్స్ ఆ ఫోటోను చూసి సంబరపడిపోతున్నారు. ఇద్దరి స్టిల్స్ ఇంచుమించు కొత్తగా ఉండటంతో నమ్రత అబ్జర్వేషన్‌ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.