గణేశుడి నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు!

గౌరీ తనయుడిని గంగ ఒడికి తరలించేందుకు ప్రభు త్వ విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 5న జరిగే మహానిమజ్జనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మేయర్‌ రామ్మోహన్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులతో చర్చించారు. రహదారుల మరమ్మతు, శాంతి భద్రతల పరిరక్షణ, శోభాయాత్ర సాఫీగా సాగేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలో ని 23 చెరువుల్లో నిమజ్జనం జరుగుతోంది. అన్ని ప్రాం తాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు.

నిమజ్జనం సందర్భంగా సమస్యలుంటే ఫిర్యా దు చేసేందుకు ఫోన్‌ నెంబర్లను అందుబాటులో ఉం చుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సామూహిక నిమజ్జన వేడుకలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. గ్రేటర్‌లోని చౌరస్తాలు, పలు ప్రాంతా ల్లో ఉన్న సీసీ కెమెరాలను కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. శోభాయాత్ర సాగే మార్గంలో గార్బేజ్‌, నిర్మాణ రంగ వ్యర్థాలను తొలగించాలని మేయర్‌ సూచించారు. బ్లీచింగ్‌, సున్నపు పౌడర్‌ వేయాలని, నిత్యం రెండు పర్యాయాలు చెత్త తొలగించాలన్నారు.