బ్రేకింగ్ న్యూస్: మొత్తం ఆధార్ కార్డులు రద్దు?

ఆగస్టు 24, 2017న సుప్రీం కోర్టు వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కుల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ స్కీమ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని సుప్రీం కోర్టులో ఈ అంశంపై వాదిస్తున్న ప్రసన్న చెప్పారు. 2016లో ఆధార్‌కు ఏ చట్టబద్ధత లేదు. 2016కు ముందు సేకరించిన సమాచారం ఏ చట్టాన్ని అనుసరించి చేయలేదు. దీనిపై ఓ కమిటీ వేసే అవకాశం ఉందని ఆయన భావించారు. పేద ప్రజలకు మాత్రం వ్యక్తిగత గోప్యత అవసరం లేదా? అలా అని పేదోళ్లు వచ్చి చెప్పారా? పేదరికం, వ్యక్తిగత గోప్యతల్లో ఏదో ఒకటి తేల్చుకోమని ప్రభుత్వం బలవంతం పెడితే ఎలా అనేది ఆయన ప్రధాన వాదన. ఈ తీర్పు ప్రభావం చాలా పథకాలపై ఉండొచ్చని ప్రసన్న అన్నారు. భవిష్యత్తులోనూ దీని ప్రభావం ఉండొచ్చన్నారు.
2016కు ముందు సేకరించిన సమాచారాన్ని నాశనం చేయాల్సిందే. ఇప్పటికే సేకరించిన సమాచారం భద్రంగా ఉంచడానికి డేటా ప్రొటక్షన్‌లా చేయాల్సి ఉందని ప్రసన్న అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సుప్రీం కోర్టు తీర్పుతో కేంద్రం సందిగ్ధంలో పడింది. దీనిపై పార్లమెంట్ దయకు విషయం వదలకుండా సుప్రీం కోర్టు చొరవ తీసుకోవడం హర్షనీయమని ఆయన అన్నారు. వీటిని బట్టి చూస్తే ఆధార్ స్కీమ్ ఎప్పుడైనా రద్దు కావచ్చు అన్నది స్పష్టమవుతోంది. చట్టం, ప్రభుత్వం ఏం చేస్తాయో చూద్దాం.