చైనా ఆర్మీకి కొత్త కమాండర్

త్వరలో చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ఆర్మీలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్మీ కొత్త కమాండర్‌గా లీ జుకోంగ్ స్థానంలో హన్ వీగువోను నియమించారు. లీ జుకోంగ్‌ను పీప్పుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చీఫ్‌గా నియమిస్తూ ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన 1979లో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సీనియర్ సైనికాధికారి. కాగా లీ స్థానంలో బాధ్యతలు చేపడుతున్న హాన్ ఇంతకుముందు బీజింగ్, సెంట్రల్ చైనా మిలటరీ డిస్ట్రిక్ట్‌ ‘సెంట్రల్ థియేటర్ కమాండ్‌’కు సారథ్యం వహించారు.