ముద్రగడ్డ హడావుడి ఉత్తుత్తిదే: నారాయణ

కాకినాడలో టీడీపీ గెలుపుతో ముద్రగడ ఉద్యమం ఉత్తుత్తిదేనని తేలిందని మంత్రి నారాయణ ఎద్దెవా చేశారు. ’’ఏబిఎన్’’ తో ఆయన మాట్లూడుతూ… ‘‘కాకినాడ ఎన్నికలకు ముందు ముద్రగడ పాదయాత్ర పేరుతో హడావిడి చేయాలని చూశారు, కాకినాడ ప్రజలు, కాపులు ముద్రగడ యత్నాలను తిప్పికొట్టారు, చంద్రబాబు మాత్రమే కాపులకు రిజర్వేషన్లు ఇస్తారని నమ్మారు’’ అని మంత్రి నారాయణ వెల్లడించారు.
పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టంకట్టారని ఆయన తెలిపారు. కులం, మతం, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టాలని వైసీపీ చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారని మంత్రి మండిపడ్డారు. కోర్టు ఆదేశాల ప్రకారం మిగతా కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని నారాయణ చెప్పుకొచ్చారు.