బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదేం

నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా రోడ్‌షోలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటర్లకు డబ్బు పంచితే… ఆ వ్యవహారంపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఇలాంటి చర్యల వల్ల నష్టపోయే బాధితులే కోర్టును ఆశ్రయించాలని, మీకేం సంబంధమని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది నాగిరెడ్డి బదులిస్తూ… తాము ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు