కేసీఆర్ కేబినెట్‌లో చేతగాని మంత్రులు: రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ కేబినెట్‌లో అంతా చేతగాని మంత్రులే ఉన్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ కనుసన్నల్లోనే రైతు సమాఖ్య కమిటీల ఏర్పాటైయ్యాయన్నారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ… మన ఊరు-మన ప్రణాళిక తెచ్చి మూడేళ్లయినా దిక్కుమొక్కులేదు, తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘సమగ్ర భూ సర్వే వల్ల కేసీఆర్‌కు ప్రయోజనం ఉంది, జీవో 39ను వ్యతిరేకిస్తున్నాం, రద్దు చేసేవరకు పోరాడతాం’’మని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.