అత్యుత్తమ ఆవిష్కరణలకు అమరావతి కేంద్రబిందువు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తూ.. ఆ టెక్నాలజీని వినియోగించుకునే నోడల్ సెంటరుగా కేఎల్ యూనివర్సిటీ వుంటుందని తెలిపారు. కేఎల్యూలో మూడురోజులుగా జరుగుతున్న ఓపెన్ ఇన్నోవేషన్ హాకథాన్ ముగింపు సభలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత రైతులను డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సాంకేతికంగా అనేక సంస్కరణలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోనూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తామన్నారు.
- డిజిటల్ టెక్నాలజీ ద్వారా గ్రామాల అభివృద్ధి
- నోడల్ టెక్నాలజీ సెంటరుగా కేఎల్ యూనివర్సిటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- కేఎల్యూలో ముగిసిన ఓపెన్ ఇన్నోవేషన్ హాకథాన్ సదస్సు